68వ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎర్రకోట నుండి దేశప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.పాలకులు,నేతలు దేశ నిర్మాతలు కారని శాస్త్రవేత్తలు,రైతులు,కార్మికులు,ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు,పార్టీల కన్నా దేశమే మిన్నా అందరం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు.
కలిసి ఆలోచిద్దాం,కలిసి ముందుకు నడుద్దాం ఐకమత్యంతో దేశాభివృద్ధికి తోడ్పడుదాం అని,దేశాభివృద్ది మన భాద్యత కాదు మన పూర్వీకుల కల అని పేర్కొన్నారు.
దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మనకు తలవంపులు తెస్తున్నాయి,అత్యాచారాల గురుంచి విన్నప్పుడల్లా మన తలలు సిగ్గుతో దించుకోవాలి.ఆడపిల్లలను తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టి చూసుకుంటారు,కంటి పాపకు దెబ్బ తగిలితే హృదయం విలవిలలాడద అని పేర్కొన్నారు. ఆడపిల్లలనే కాదు మగ పిల్లలను కూడా తల్లిదండ్రులు అదుపులో పెట్టాలని సూచించారు ప్రధాని.10,12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలను ఎక్కడికి వెళ్తున్నావ్,ఎప్పుడు వస్తావ్,వెళ్ళగానే ఫోన్ చేయి అని తల్లిదండ్రులు అడుగుతుంటారు.అదే మీ అబ్బాయిల విషయంలో కూడా ఇలానే తల్లిదండ్రులు వ్యవహరించాలని అన్నారు.అత్యాచారాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు తమ అబ్బాయిలతో చర్చించాలని సూచించారు... Read More
No comments:
Post a Comment