Radio LIVE


Breaking News

Friday, 29 August 2014

నేడు భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే

5 వన్డేల సీరీస్ లో భాగంగా శనివారం భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరగనుంది.సీరీస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవగా,రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న భారత్ జట్టును విరాట్ కోహ్లి ఫామ్ కలవరపరుస్తుంది.దానికితోడు ఓపెనర్ రోహిత్
శర్మ గాయం కారణంగా సీరీస్ నుండి తప్పుకోవడం ఒకింత కలవరపరిచే అంశం అయినప్పటికీ మిగతా ఆటగాళ్ళు ఫామ్ లో ఉండడం భారత్ కు అనుకూలించే అంశం.రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్ ఆడనున్నాడు.మురళీ విజయ్ ఇంకా ఇంగ్లాండ్ కు చేరుకోకపోవడంతో రహనే ఓపెనర్ గా రాయుడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
వన్డేల్లో అంతగా రాణించని కుక్ సేన బౌలింగ్ విభాగంలో ఉన్న బలహీనతలను అధిగమించి ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తుంది.పిచ్ విషయానికి వస్తే మొదటి టెస్ట్ ఇక్కడే జరిగింది,బ్యాటింగ్ కు అనూకులించే అవకాశాలు ఎక్కువ.మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

For More News  Visit Radiojalsa

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates