వన్డే ప్రపంచ ఛాంపియన్స్ భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై సునాయాస విజయం సాధించింది.శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది.మొదట వికెట్ కు కుక్,హేల్స్ కలిసి 82 పరుగులు జత చేశారు.తరువాత వచ్చిన ఆటగాలు పరుగులు రాబట్టడడంలో విఫలం అవడం,తక్కువ పరుగులకే ఒకరి వెంట ఒకరు ఔట్ అవడంతో 227 పరుగులకే ఆలౌట్ అయింది.చివర్లో ట్రేడ్ వెల్ వేగంగా 30 పరుగులు చేయడంతో 200 పరుగులు స్కోర్ దాటింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధావన్(16) వికెట్ ను త్వరగానే కోల్పోయినా తరువాత రహనే(45),కోహ్లి(40)కలిసి 50 పరుగులు జోడించారు.నాలుగో వికెట్ కు రాయుడు,రైనా కలిసి 87 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.రోహిత్ శర్మ గాయంతో వైదొలగడంతో ఈ మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న రాయుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.64 పరుగులు చేసిన రాయుడు ఒక వికెట్ కూడా దక్కించుకున్నాడు.జట్టు స్కోర్ 207 పరుగులవద్ద రైనా(42)అవుట్ అయినా జడేజా(19*)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు రాయుడు.మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్ కి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ విజయంతో 5 మ్యాచ్ ల సీరీస్ లో 2-0 తో ముందుంది భారత్.
No comments:
Post a Comment