Radio LIVE


Breaking News

Wednesday, 27 August 2014

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఇక 80 మార్కులకే

తెలంగాణా రాష్ట్రంలో 9,10వ తరగతి పరీక్షల సంస్కరణను ప్రభుత్వం చేపట్టింది.దీనికి సంబందించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రభుత్వం.ఈ సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నాయి.
ప్రస్తుతం ఉన్న తొమ్మిది పేపర్ల స్థానే ఇప్పుడు 11 పేపర్లు ప్రవేశపెట్టనున్నారు.అలాగే ప్రతీ సబ్జెక్టులో పరీక్ష 80 మార్కులకు నిర్వహించనున్నారు.అంటే మిగతా 20 మార్కులు ఇంటర్నల్స్(అంతర్గత మూల్యాంకనం-ఫార్మేటివ్ అసెస్మెంట్స్) కిందికి వస్తాయి.వీటిని ఉపాధ్యాయులే నిర్నహిస్తారు.అన్నీ కలిపి ప్రతీ సబ్జెక్టులో 35 మార్కులు వస్తే
విధ్యార్థులు పాస్ అవుతారు.అంతర్గత మూల్యాకనంలో సున్నా వచ్చినా రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వస్తే సరిపోతుంది,ఇంకా అంతకు మించి ఎలాంటి నిభందనలు లేవు.
ఇక మీదట ప్రశ్నాపత్రాల రీవాల్యూయేషన్ ఉండదు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ మాత్రమే ఉంటాయి.ఇక నుండి విద్యార్థులు ప్రైవేటుగా రాసుకోవడానికి కుదరదు.అలా రాసుకోవాలంటే ఓపెన్ స్కూల్ విధానంలో రాసుకోవాల్సి ఉంటుంది.
visit radiojalsa.com for more news updates
పరీక్ష నూతన విధానం-మార్కులు
Subject Paper-I Paper-II Internal Total
ఫస్ట్ లాంగ్వేజ్
(తెలుగు/హిందీ/ఉర్దూ)
40 40 20 100
సెకండ్ లాంగ్వేజ్
(తెలుగు/హిందీ)
80 00 20 100
థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్) 40 40 20 100
గణితం  40 40 20 100
సామాన్య శాస్త్రం 40
(భౌతికం)
40
(జీవశాస్త్రం)
20 100
సాంఘీక శాస్త్రం 40 40 20 100
మొత్తం 280 200 120 600

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates