అశ్లీల వెబ్ సైట్లను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని
అని అది తమవల్ల కాదని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో
తెలిపింది.ఇండియాలో దాదాపుగా 4 కోట్ల అశ్లీల వెబ్ సైట్లు ఉన్నాయి,ఒక సైట్
ను బ్లాక్ చేస్తే కొత్తగా మరొకటి పుట్టుకొస్తుంది అని ప్రభుత్వం
సుప్రీంకోర్టుకు తెలియజేసింది.చైల్డ్ పోర్నోగ్రఫీ మీద నిషేధం
విధించాలని,పెద్దలకు సంబందించిన అశ్లీల వెబ్ సైట్ లను బ్లాక్ చేయాలని
కోరుతూ గత సంవత్సరం దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం శుక్రవారం కోర్టులో
విచారణకు రాగా ప్రభుత్వం తన వాదనను కోర్టుకు వినిపించింది.
బూతు సైట్లకు సంభందించిన సర్వర్లు అన్నీ బయటి దేశాల్లో ఉండడంవల్ల వాటి మీద నియంత్రణ కష్టమవుతుంది,ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ నియమించడం జరిగింది అంది కేంద్రం తెలిపింది.తదుపరి విచారణలో కమిటీ పురోగతి కోర్టుకు తెలియజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది(తదుపరి విచారణ 6 వారాల తరువాత జరగనుంది).చట్టం,సాంకేతిక పరిజ్ఞానం,పాలన మొదలగు వాటిని ఉపయోగించి ఇంటర్నెట్ లో అశ్లీలతను తగ్గించే ప్రయత్నం చేయాలని కోర్టు సూచించింది.
మహిళల మీద అత్యాచారాలకు ఈ అశ్లీల చిత్రాలే ఆద్యం పోస్తున్నాయని పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.ఢిల్లీలో 2012 సంవత్సరంలో ఒక వైద్య విద్యార్థిని మీద కొందరు కామపిశాచులు అత్యాచారం చేసిన ఘటనను ఇందులో పేర్కొన్నారు పిటీషనర్,ఈ ఘటనకు ముందు ఆ దుర్మార్గులు వారి సెల్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలు చూశారని పిటీషన్లో పేర్కొన్నారు.
కోర్టు మరియు ప్రభుత్వం అనుమతి లేకుండా అశ్లీల సైట్లను బ్లాక్ చేయడం ఆచరణ పరంగా మరియు సాంకేతికపరంగా అసాధ్యమని ఈ సంవత్సరం జనవరిలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.
For More News Visit Radiojalsa.com

No comments:
Post a Comment