ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం
ఉన్నట్టు విశాఖ తూఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.ఒడిశా నుండి దక్షిణ
తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతుండడంతో పాటు నైరుతి
ఋతుపవనాల బలంగా ఉండడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలో పలుచోట్ల వర్షాలు
పడుతున్నాయి.ఇదే
పరిస్థితి మరో 24 గంటలు కొనసాగవచ్చు అని తూఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
పశ్చిమ బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసరప్రాంతములలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల మరో రెండురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో కర్ణాటక,కొంకణ్,గోవా,మహారాష్ట్ర ల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

No comments:
Post a Comment