Radio LIVE


Breaking News

Wednesday, 20 August 2014

పడుకుంటే చనిపోతారని వదంతులతో రాత్రంతా జాగారం

రాత్రి పడుకుంటే చనిపోతారనే వదంతులతో ఖమ్మం,నల్గొండ,వరంగల్ జిల్లాలలోని పలు చోట్ల జనం రాత్రంతా జాగారం చేశారు.ఈ వదంతులకు బయపడిన జనం పడుకోకుండా రోడ్లమీదే జాగారాలు చేశారు.
ఆవు కడుపున శిశువు పుట్టింది అని,అప్పుడే పుట్టిన పాప మాట్లాడింది అని,పడుకుంటే చనిపోతారు అని పుకార్లు షికార్లు చేశాయి.ఫోన్ల ద్వారా వార్త దావానలంలా వ్యాపించింది.మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రోడ్ల మీదే ఉన్నారు.పిల్లలు,పెద్దవారు ఎవరు నిద్రపోలేదు.బంధువులు,తెలిసినవారితో ఈ వదంతులు వ్యాపించి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు రాఖీ కట్టించుకున్న వారందరూ చనిపోతారు అనే వదంతుతో పలుప్రాంత ప్రజలు కలవరానికి గురయ్యారు.


1 comment:

  1. పిచ్చి తలకెక్కటం అంటే ఇదే

    ReplyDelete

Designed By Published.. Blogger Templates