వచ్చే ఏడాది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెరుగుపడ్తుందని రేటింగ్ ఏజెన్సీ మూడీ అంటోంది.గడిచిన రెండేళ్ళలో జీడీపీ 5% కంటే తక్కువగానే నమోదైంది.కాగా 2015 లో జీడీపీ 5 నుంచి 6%గా ఉంటుందని మూడీ అంచనా వేసింది.
బలమైన దేశీయ డిమాండు,వైవిధ్య ఎగుమతి మార్కెట్లు జీడీపీ పెరుగుదలకు దోహదపడనున్నాయి.ఉద్యోగాలతో పాటు వినియోగమూ పెరగనుంది.గ్లోబుల్ మార్కెట్లలో ధరల తగ్గుదల దేశీయ ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచగలదని రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.
No comments:
Post a Comment