ఇప్పటివరకు 12 మంది సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా మరో 6 మంత్రులు చేరడం వల్ల రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడింది.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు :
1)తుమ్మల నాగేశ్వర్రావు -రోడ్లు,భవనాలు,మహిళా శిశు అభివృద్ధి.
2)అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి -గృహనిర్మాణం,న్యాయశాఖ,దేవాదాయ.
3)తలసాని శ్రీనివాస యాదవ్ -వాణిజ్య పన్నులు,సినిమాటోగ్రఫీ.
4)అజ్మీర చందూలాల్ -గిరిజన అభివృద్ధి,పర్యాటక,సాంస్కృతిక.
5)సి.లక్ష్మా రెడ్డి -విద్యుత్
6)జూపల్లి కృష్ణారావు -పరిశ్రమలు,చక్కర,చేనేత,జౌళి.
వీరితో మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు.
వీరితో పాటు ఇద్దరు మంత్రులు కూడా అదనపు బాధ్యతలను తీసుకున్నారు.
వారు: 1)ఎక్సైజ్ మంత్రి T.పద్మారావు -క్రీడలు,యువజన సర్వీసులు
2)అటవీ మంత్రి జోగు రామన్న –BC సంక్షేమం.
No comments:
Post a Comment