ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40)గుండెపోటుతో మృతి చెందారు.చక్రి స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్.15 జూన్ 1974 లో జన్మించిన చక్రి అసలు పేరు చక్రధర్ గిల్లా.
బాచి సినిమాతో చక్రి సంగీత దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు.85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు.సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.సింహ సినిమాకు చక్రి నంది అవార్డ్ అందుకున్నారు.చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు.
చిన్న వయస్సులోనేచక్రి పలు హిట్ సాంగ్స్ అందించారు.సత్యం,ఇడియట్,అమ్మానాన్న తమిళ అమ్మాయి,శివమణి,దేశముదురు,గోపి గోపిక గోదారి,మస్కానేనింతే,భగీరథ,సరదాగా కాసేపు, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు.
No comments:
Post a Comment