మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు.
బుధవారం మెదక్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న మెదక్ జిల్లా అలాగే ఉంటుందని మెదక్ హెడ్ క్వార్టర్ గా జిల్లాగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
కాగా సిద్ధిపేట, సంగారెడ్డిలను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.
జిల్లా కేంద్రానికి మిగితా ప్రాంతాలకు చాలా దూరం ఉన్నందున మెదక్ ను 3 జిల్లాలుగా విభాజిస్తునట్లు ఆయన ప్రకటించారు.అంతేకాక పాలన దృష్ట్యా కూడా సిద్ధిపేటను జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.
తమ నిర్ణయానికి కొందరు ధర్నాలు చేస్తూ వ్యతిరేకించ వచ్చని అయిన కూడా సిద్ధిపేట జిల్లాగా ఏర్పడుతుందని సీఎం స్పష్టం చేశారు.
No comments:
Post a Comment