Thursday, 18 December 2014
ప్రేయసిని మరిచిపోలేక..భార్యను ప్రేమించలేక..ఓ సాఫ్ట్ వేర్ ఆత్మహత్య
ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక..కట్టుకున్న భార్యను ప్రేమించలేక ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తనువు చాలించాడు.కట్టుకున్న భార్యకు తాను ప్రేమించిన ప్రేయసికి,తల్లిదండ్రులకు,ఇతర కుటుంబసభ్యులకు మరణవాంగ్మలాన్ని(సూసైడ్ నోట్)రాసి..ఉరివేసుకున్నాడు.
బుధవారం రాత్రి కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా నర్సంపేట ఇంద్రనగర్ కు చెందిన రవీంద్రనాథ్(29)ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.డెంటల్ డాక్టర్ అయిన ప్రతిభ అనే యువతితో ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది.వివేకానందనగర్ డివిజన్ మాధవరంకాలనీలో దంపతులిద్దరూ అద్దెకు ఉంటున్నారు.
స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రతిభ విధులు నిర్వహిస్తోంది.తన వివాహ విషయంలో మనస్తాపంతో ఉన్న రవీంద్రనాథ్ కొంతకాలంగా తీవ్రమానసిక వేదనకు గురవుతున్నాడు.కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో సుమారు 8 గంటల సముయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయాన్ని స్థానికులు కూకట్ పల్లి పోలీసులకు అందించారు.
పోలీసులు పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది.అందులో తాను పెళ్ళికి ముందే ఓ అమ్మాయిని ప్రేమించానని..ఆమెను మర్చిపోలేకపోతున్నానని ప్రతిభను ప్రేమించలేక పోతున్నానంటూ తన ఆవేదనని వ్యక్తం చేశాడు.
అదేవిధంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి,అన్నావదనలు,అక్కాబావలకు తల్లిదండ్రులకు అండగా నిలవాలని ప్రాధేయపడ్డాడు.
తన భార్య చాలా మంచిదని పేర్కొంటూ..రెండేళ్ల తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచించాడు.
కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Labels:
News,
Telangana News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment