బరాక్ ఒబామాను ధిక్కరించి మరీ అమెరికన్ చట్టసభ సభ్యులు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు.
బిల్లుకు అమెరికా సెనేట్,ప్రతినిధుల సభ ఈ మేరకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు.
మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల తిరుగుబాటుదారుల దాడిపై అమెరికా మరింత కఠిన వైఖరిని తీసుకోవడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.అమెరికా చర్యలకు దీటుగా తమ చర్యలు ఉంటాయని తెలిపింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్- రష్యా దౌత్య సంబంధాలపై తమకేమీ అభ్యంతరం లేదని అమెరికా తెలియజేస్తూ భారతదేశం రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
No comments:
Post a Comment