సీబీఐ కొత్త డైరెక్టర్ గా సీబీఐ స్పెషల్ డీజీ అనిల్ కుమార్ సిన్హా నియమితులయ్యారు..మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ప్రస్తుత సీబీఐ రంజిత్ సిన్హా పదవీకాలం మంగళవారం పూర్తికావడంతో సీబీఐ కొత్త డైరెక్టర్ ను ఎంపిక చేసేందుకు మోదీ నేతృత్వంలోని కమిటీ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యి అనిల్ సిన్హాకు సీబీఐ చీఫ్ గా ప్రమోషన్ ఇస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రధాని అదనపు ముఖ్య సలహాదారు పీకే మిశ్రా ఈ విషయాన్ని దృవీకరించారు.
1979 బీహార్ క్యాడర్ కు చెందిన అనిల్ గతంలో చీఫ్ విజులేన్స్ కమిషన్ కు అదనపు కార్యదర్శి గా వ్యవహరించారు.గతంలో సెంట్రల్ విజులేన్స్ కమిషనర్ నేతృత్వంలోని ప్యానల్ సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసింది.లోకపాల్ చట్టం ప్రకారం సీబీఐ డైరెక్టర్ ను తొలిసారిగా ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఎంపికచేసింది.కేంద్ర సిబ్బందిశాఖ సూచించిన 43 మంది అధికారుల పేర్లను పరిశీలించిన కమిటీ అనిల్ కుమార్ సిన్హా ను చవరకు ఎంపిక చేసింది.
No comments:
Post a Comment