సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్(100) కన్నుమూశారు.కోచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయ్యర్ తుదిస్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కృష్ణ అయ్యర్ కేరళలోని పాలక్కడ్ వద్ద వైద్యనాథపురంలో జన్మించారు.
ఆయన 1952లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1957లో మంత్రిగా తొలి కమ్యునిస్టు ప్రభుత్వంలో పనిచేశారు.
1973లో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
1999లో భారత ప్రభుత్వం కృష్ణ అయ్యర్ కి పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
అయ్యర్ చట్టాలు,న్యాయలపై అనేక పుస్తకాలు రాశారు.
మొత్తం 105 పుస్తకాలను ప్రచురించిన ఆయన 4 యాత్ర పుస్తకాలను కూడా రాశారు.
తన జీవిత చరిత్రను ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్’ పేరుతో రాసుకున్నారు.
No comments:
Post a Comment