గంగానదిని 764 పరిశ్రమలు కాలుష్యపూరితం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.రాజ్యసభలో సోమవారం లేవనెత్తిన ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన ప్రకారం పైన పేర్కొన్న పరిశ్రమల్లో కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే 687 పరిశ్రమలున్నాయని తెలిపింది.
ఈ పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలు గంగానదిలో గానీ లేదా ఉపనదులైన రామ్ గంగా, కలీ ఈస్ట్ లో గానీ కలిసి కలుషితమవుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ సహాయకమంత్రి సన్వర్లాల్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment