దేశంలోనే అత్యుత్తమ పంచాయతీ రాజ్ రోడ్ల నెట్ వర్క్ కు తెలంగాణా ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. బీటీ రోడ్ల రేన్యువల్స్ కు ఏకకాలంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి కేటీఅర్ తెలిపారు.దశల వారిగా రోడ్ల అప్ గ్రేడేషన్, కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
మొత్తం 64,046 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్ల నెట్ వర్క్ జరుగుతుందన్నారు.
18,564 కి.మీ.- బీటీ రోడ్లు
14,148 కి.మీ.-మెటల్ రోడ్లు
29,617 కి.మీ – మట్టి లేదా మొరం రోడ్లు వేస్తామని కేటీఆర్ చెప్పారు.
4,180 కి.మీ.మెటల్ రోడ్డును 2,380 కోట్లతో బీటీ రోడ్డుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.
20,000 కి.మీ మట్టి రోడ్డుకు రూ.600 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
2014-15 ఏడాదికి గానూ 1,767 కోట్లతో 12,006 కి.మీ.బీటీ రోడ్ల రెన్యువల్ చేస్తామని ఆయన ప్రకటించారు.
No comments:
Post a Comment