గత జనవరిలో హోలాండే, గేయట్ మధ్య సంబంధం కొనసాగుతున్నట్లు
వార్తలు గుప్పుమన్నాయి. అంతర్జాతీయంగా ఈ వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కగా..తాజాగా
ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్ లో హోలాండే-గేయట్ పక్కపక్కనే కూర్చున్న
ఫోటోలు వేలుగుచూడటం దుమారం రేపుతున్నది.తాజాగా అధ్యక్ష భవనానికి చెందిన ఐదుగురు
సిబ్బందిపై ఈ వ్యవహారంలో బదిలీ వేటు వేశారు.హోలాండ్-గేయట్ మధ్య ప్రేమాయణం
సాగుతుందన్న వార్తల నేపథ్యంలో వాయిస్ మ్యాగజీన్.. అధ్యక్ష భవనంలో ఇద్దరు
పక్కపక్కనే కూర్చున్న మూడు ఫోటోలను ప్రచురించింది.
Read more ...
Breaking News
Sunday, 30 November 2014
సాంబా సెక్టార్ లో పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్తాన్ సాంబా సెక్టార్ లో కాల్పులకు
పాల్పడింది. పాక్ బలగాలు బీఎస్ఎఫ్ శిబిరంపై కాల్పులు జరిపింది. భారత జవాన్లు ఈ
కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టారు.
Read more ...
Labels:
National News
మైనార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించిన దత్తాత్రేయ
బీజేపీ కార్యాలయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి
బండారు దత్తాత్రేయ మైనార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. వెబ్ సైట్ ప్రారంభం పట్ల
హర్షం వ్యక్షం చేసిన దత్తాత్రేయను సన్మానించారు. దత్తాత్రేయ ఈ సందర్భంగా
మాట్లాడుతూ 2019లో మద్దతుతోనే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని విశ్వాసం
వ్యక్తం చేశారు. మోడీ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలకు అందరూ మద్దతు పలకాలని
కోరారు.దేశంలో పేదవాళ్లు లేకుండా చేయడమే
జన ధన్ యోజన పథకం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Read more ...
Labels:
National News
జన్ ధన్ యోజన పథకం విజయవంతమైంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్ ధన్ యోజన పథకం విజయవంతమైందని వెల్లడించారు. అసోం భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. అక్రమ వలసలను అరికడతాం, సరిహద్దులను పరిరక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ఒక్కటే బీజేపీ ప్రభుత్వ లక్యమన్నారు.
Read more ...
Labels:
National News
మకావు ఓపెన్ విజేత : పి.వి.సింధు
పి.వి. సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ఫిక్స్ గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచింది. కొరియా క్రీడాకారునిపై 21-12, 21-17 తేడాతో గేలుపొందింది.
Read more ...
Labels:
Sports News
Saturday, 29 November 2014
ఎన్టీఆర్ ను లక్ష్మి పార్వతే చంపేశారు : నన్నపనేని రాజకుమారి
సీఎం కీసీఆర్ కు ఎన్టీఆర్ మరణంపై విచారణ చేపట్టాలని
లక్ష్మి పార్వతి రాసిన లేఖపై టీడీపి నేత నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ.. లక్ష్మి
పార్వతే ఎన్టీఆర్ ను చంపేశారని ఆరోపించారు. వాస్తవానికి లక్ష్మి పార్వతి ఎన్టీఆర్
జీవితంలోకి వచ్చిన తర్వాతే ఆయన జీవితం క్షీణించసాగిందని అంతకు ముందు ఆయనపై తాము
ఎదురు దాడి చేశామని, ఎన్టీఆర్ గుండె అప్పుడు ఎంతో గట్టిగా ఉండేదన్నారు. విచారణ
జరిపితే లక్ష్మి పార్వతిపైనే జరిపించాలని ఆమే అన్నారు. ఎన్టీఆర్ కు ఇచ్చే మందులు,
భోజనంపై కూడా విచారణ జరిపించాలని నన్నపనేని డిమాండ్ చేశారు.
Read more ...
Labels:
Andhra Pradesh News
యూకే లో భారత పైలెట్ల విగ్రహ ప్రతిష్టాపన
రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్యసాహసాలను చూపిన భారత పైలెట్ కు యూకే లో అరుదైన గౌరవం లభించింది. ఓ
స్మారకోత్సవంలో స్కాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పుజీ యొక్క 8 అడుగుల కాంస్య
విగ్రహాన్ని గ్రేవ్ సెండ్ లోని సెయింట్
ఆండ్రూస్ గార్డన్ వద్ద ఏర్పాటు చేశారు.రెండో ప్రపంచ యుద్ధంలో పుజీ జర్మన్ ఫైటర్లపై
వీరోచితంగా పోరాడారు.
Read more ...
Labels:
National News
ఆదివారం నిర్వహించనున్న 10కే రన్ కు మిల్కాసింగ్
ఆదివారం నగరంలో నిర్వహించనున్న 10కే రాన్ కు ప్రముఖ అథ్లెటిక్ ఫ్లైయింగ్ సిక్ మిల్కా సింగ్ హాజరుకానున్నారు.ఉదయం నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే రాన్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు నగరం చేరుకున్న ఆయన సికింద్రాబాద్ లోనే తన క్రీడా జీవితం మొదలైందని గుర్తు చేసుకున్నారు. తన పేరిట ఇక్కడి ఈఎంఈ సెంటర్లో ఒక స్టేడియంను నిర్మించడం తనకెంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు.
Read more ...
Labels:
National News
వాళ్ళు అదో టైపు : హెచ్.రాజా
కాంగ్రెస్ పార్టీలో ఇటివల చేరిన కుష్బూ,ఆమెను పార్టీలోకి ఆహ్వానించిన సోనియా గాంధీలను
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి H. రాజా తీవ్రంగా విమర్శించారు. పెళ్ళికి ముందే
శృంగారాన్ని సమర్ధించిన కుష్బూ, స్వలింగ సంపర్కానికి సంబంధించి చట్టంలో సవరణలు
తీసుకురావాలన్న సోనియాలు కలిసినా తమిళనాడులో బీజేపీని ఏమీ చేయలేరన్నారు. ద్రవిడ
పార్టీలకు పోటీ, ప్రత్యామ్నాయం భాజాపాయే అన్నారు.
Read more ...
Labels:
National News
భారత్ లో విమానాల తయారీకి రష్యా ఆసక్తి
ఇండియాలో తేలికపాటి రవాణా విమానాలు, హెలికాప్టర్ల
తయారీకి రష్యా ఆసక్తిగా ఉందని లోక్ సభలో నిర్మలా సితారామన్ చెప్పారు.తయారీలో వారి
సాంకేతిక పరిజ్ఞానాన్నే వాడుతున్నారు. భారత ప్రభుత్వం దీన్ని ఆహ్వానిస్తుందనీ,
ద్వైపాక్షిక పెట్టుబడికి, వాణిజ్య సహకారానికి భారత్ కట్టుబడి ఉందని వాణిజ్య మంత్రి
చెప్పారు. నవంబర్ 5న వాణిజ్యం, పెట్టుబడులపై భారత్-రష్యా ఫోరమ్ ఎనిమిదవ సమావేశం
జరిగింది.
Read more ...
Labels:
International News,
National News
Friday, 28 November 2014
అత్యాచారం చేసే వారిలో బాయ్ ఫ్రెండ్సే ఎక్కువని చెప్తున్నా తాజా గణాంకాలు
అత్యాచారం చేసే బాయ్ ఫ్రెండ్స్ సంఖ్య
పెరుగుతుందని తాజా గణాంకాలు చెప్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ముంబైలో 542 అత్యాచార కేసులు నమోదు కాగా, అందులో 389
కేసుల్లో బాయ్ ఫ్రెండ్స్ చేతుల్లో అమ్మాయిలు అత్యాచారానికి గురైనవి అని ముంబై
పోలీసులు అంటున్నరు. యువతులు బాయ్ ఫ్రెండ్స్ చెప్పే తీయని మాటలను నమ్మీ ఇటువంటి
దారుణాలకు బలవుతున్నారని ముంబై పోలీసు కమీషనర్ రాకేశ్ మారియా అన్నారు.
Labels:
National News
Thursday, 27 November 2014
మానవ వ్యర్ధంతో రాకెట్ ఇంధనం
భారత సంతతి పరిశోధకులు అమెరికాలో మనవ వ్యర్ధాన్ని
బయోగ్యాస్ గా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే
రాకెట్లలో ఈ బయోగ్యాస్ ను ఇంధనంగా వాడతారు. అంటే దీనివల్ల చాలినంత ఇంధనం భూమి
నుండి తీసుకోకపోయిన ఫరవాలేదన్న మాట. ఈ ప్రక్రియను అభివృద్ధి చేసిన పుల్లమ్మనపల్లిల్
ప్రతాప్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణతో తమ చుట్టూ కక్ష్యలో తిరిగే మానవ వ్యర్ధాన్ని
బరించడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు తప్పుతుందన్నారు.
Labels:
International News,
National News
వరంగల్ లో సూరత్ కు ధీటుగా టెక్స్ టైల్ హబ్:సీఎం
సురత్ కు ధీటుగా వరంగల్ లో టెక్స్ టైల్
హబ్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కీసీఆర్ తెలిపారు. సీఎం శాసనసభలో
ప్రసంగిస్తూ దేశంలో అనేక టెక్స్ టైల్ పరిశ్రమల్లో మన నిపుణులున్నారని తెలిపారు.
5-6 లక్షల పవర్ లూమ్స్ ని వరంగల్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్-మచిర్యాల, హైదరాబాద్-ఖమ్మం, హైదరాబాద్-నల్గొండ ల మధ్య ఇండస్ట్రియల్
కారిడార్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాలసీ ప్రకటించిన తర్వాత ప్రవాసీ
తెలంగాణ దివస్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Labels:
Telangana News
Wednesday, 26 November 2014
టీటీడీ నుంచి రూ.241 కోట్లు రావాలి : హరీష్ రావు
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రూ.241 కోట్లు రావాల్సి ఉందని అసెంబ్లీ వ్యవహారాలు, బారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీష్ రావు సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ...ప్రభుత్వం తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు టీటీడీ నుంచి నిధులు రప్పించడానికి చర్యలు తీసుకోవాలని సేఎం అధికారులను ఆదేశించిన విషయాన్నీ మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన దూపదీప నివేద్యం పతకం కోసం కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించమని వివరించారు.
దూపదీప నైవేద్యం పతకం తమ ప్రభుత్వ పథకం కాకున్నా బేషజాలకు పోకుండా దైవ కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇచ్చామని అన్నారు. నల్గొండ జిల్లాలోని సుమారు 200 దేవాలయాల పునరుద్ధరణకు రూ.25 కోట్లు అవసరం ఉందని వివరించారు.అలాగే రాష్ట్రంలో జీర్ణదశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు.
దూపదీప నైవేద్యం పతకం తమ ప్రభుత్వ పథకం కాకున్నా బేషజాలకు పోకుండా దైవ కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇచ్చామని అన్నారు. నల్గొండ జిల్లాలోని సుమారు 200 దేవాలయాల పునరుద్ధరణకు రూ.25 కోట్లు అవసరం ఉందని వివరించారు.అలాగే రాష్ట్రంలో జీర్ణదశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు.
Labels:
Andhra Pradesh News,
Telangana News
సానియా యూత్ ఐకాన్ అంటూ ఐరాస ప్రశంసల జల్లు
ఒక్క భారత్ కే కాకుండా, ప్రపంచ బాలికలందరికి సానియా ఆదర్శామంటూ ఐరాస సానియాపై
ప్రశంసల జల్లు కురిపించింది. ఐరాస సెక్రెటరీ జనరల్, ఐరాస మహిళా విభాగం
డిప్యూటి ఎక్స్ క్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపురి మాట్లాడుతూ క్రీడారంగానికి
సానియా లైట్ హౌస్ వంటిదని, ఎన్నోసార్లు మహిళల సమస్యలపై ఎలుగేత్తిందన్నారు.
సానియా ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరించడం తమకు
గౌరవమన్నారు.
Labels:
International News,
National News
Tuesday, 25 November 2014
కాశ్మీర్ పై ప్రత్యేక కథనాన్ని రూపొందించినందుకుగాను టీన్యూస్ కు అవార్డు
ఇటివల కాశ్మీర్ రాష్ట్రంలో సంభవించిన
వరదలపై ప్రత్యేక కథనాన్నిరూపొందించిన టీ న్యూస్ అవార్డు కు ఎంపికైంది.మంగళవారం
జరిగిన ఒక కార్యక్రమంలో టీ న్యూస్ తరపున సంస్థ ఉర్దూ ఎడిటర్ ఖయ్యూం అన్వర్ ఈ అవార్డ్
ను స్వీకరించారు. మేఘాలయ సీఎం ముకుల్ వాస్నిక్, ఉత్తరఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ
చేతుల మీదుగా ఈ అవార్డ్ ప్రధాన కార్యక్రమం జరిగింది.
Labels:
National News,
Telangana News
Subscribe to:
Posts (Atom)