జూన్ 10 నుండి ప్రారంభయ్యే బంగ్లాదేశ్ పర్యటనకు భారత క్రికెట్ జట్టును బుధవారం ప్రకటించింది బీసీసీఐ.పేలవమైన ఫామ్ తో ఇన్ని రోజులు భారత జట్టులో స్థానం దొరకడమే కష్టం అనుకున్న హర్భజన్ సింగ్ ఎట్టకేలకు బౌలింగ్ లో సత్తాచాటి మళ్ళీ భారత జట్టులో స్థానం సంపాదించాడు.హర్భజన్ చివరిసారిగా మార్చి,2013 లో భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ జట్టు బంగ్లాతో ఒక టెస్టు మ్యాచ్,3 వన్డేలు ఆడనుంది.
టెస్ట్ జట్టుకు కోహ్లి కెప్టెన్ గా,వన్డే జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తారు.
జూన్ 10 నుండి జూన్ 14 టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
టెస్టు జట్టు :
కోహ్లి(కెప్టెన్),ధావన్,మురళీ విజయ్,కె ఎల్ రాహుల్,పూజార,రహనే,రోహిత్ శర్మ,వృద్దీమాన్ సాహ,అశ్విన్,హర్భజన్ సింగ్,భువనేశ్వర్ కుమార్,కరణ్ శర్మ,ఉమేష్ యాదవ్,వరుణ్ ఆరోన్,ఇషాంత్ శర్మ
వన్డే జట్టు :
ధోని(కెప్టెన్),రోహిత్ శర్మ,ధావన్,రహనే,రాయుడు,రైనా,కోహ్లి,రవీంద్ర జడేజా,అశ్విన్,అక్షర్ పటేల్,భువనేశ్వర్ కుమార్,ఉమేష్ యాదవ్,స్టువర్ట్ బిన్నీ,మోహిత్ శర్మ,దవల్ కులకర్ణి
No comments:
Post a Comment