ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా తేల్చింది కర్ణాటక హైకోర్టు.తన మీద ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది కోర్టు. రూ.66 కోట్లకు పైగా అక్రమాస్తుల కేసులో జయతో పాటు,శశికళ,సుధాకరన్,ఇళవరసి లు కూడా నిర్దోషులు అని తీర్పు ఇచ్చింది కోర్టు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష,రూ.100 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.బెయిల్ తీసుకొని ప్రస్తుతానికి ఇంటివద్దే ఉంటుంది జయలలిత.ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు లో అప్పీల్ చేసుకుంది జయలలిత.సోమవారం ఈ కేసు తుది తీర్పును వెలువడించింది.
ఈ తీర్పుతో అన్న డీఎంకే శ్రేణులు తమిళనాడు అంతటా సంబరాలు చేసుకుంటున్నారు.జయలలిత నిర్దోషి అని కోర్టు తేల్చడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చెప్పట్టే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే జయలలిత ఇంటికి చేరుకున్నారు.
డీఎంకే ప్రజాప్రతినిధుల ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు పెట్టారు.కర్ణాటక కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్ళే యోచనలో డీఎంకే ఉంది.
No comments:
Post a Comment