ఓ యువతిని ప్రముఖ బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఇప్పిస్తానని చెప్పి నమ్మించిన ఓ వ్యక్తి ఆమెను అత్యాచారం చేశాడు.
ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం : రాజస్థాన్ కి చెందిన ఓ బంగారు వ్యాపారి ఓ యువతిని సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానని నమ్మించాడు.
తాను కూడా సినిమాల్లో నటిస్తానంటూ వాట్సాప్ లో ఆ యువతికి ఫోటోలు కూడా పంపించాడు.
అతని మాటలను నిజమని నమ్మిన యువతిని ఆ వ్యాపారి జైపూర్ లోని ఓ హోటల్ లో అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
యువతీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తూ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment