ఐపీఎల్-8వ సీజన్ చివరి ఘట్టానికి చేరింది.ఫైనల్ మ్యాచ్ లో ఆదివారం సాయంత్రం కోల్ కతా లో ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది.
అయితే ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి కలిగించే అవకాశం ఉంది.
పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి క్వాలిఫయర్ లో ముంబై చేతిలో ఓడి రెండో క్వాలిఫయర్ లో బెంగళూరును ఓడించి మరో సారి ముంబై తో టైటిల్ పోరుకు సిద్దమైంది.
ఇప్పటివరకు రెండు జట్లు ఫైనల్ లో రెండు సార్లు తలపడగా చేరోసారి విజయం సాధించాయి.2009 ఫైనల్ లో చెన్నై చేతిలో ఓడిన ముంబై,2013 లో చెన్నై ని ఓడించి టైటిల్ ఎగురేసుకుపోయింది.
ఇక రెండిటి బలాబలగాల విషయానికి వస్తే బ్యాటింగ్ పరంగా రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా ముంబై జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది.చెన్నై జట్టులో నెహ్రా,బ్రావో మినహా మిగతా బౌలర్లు అంతగా రాణించలేకపోవడం ముంబై కి కలిసోచ్చే అవకాశం.ముంబై జట్టులో మలింగా,మెక్ క్లింగన్,టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్న హర్భజన్ సింగ్ లు బౌలింగ్ లో రాణిస్తున్నారు.
No comments:
Post a Comment