ఇక నుంచి విదేశాల్లో నల్లధనం దాచుకునే భారతీయులకు 5 ఏండ్ల జైలుశిక్ష పడుతుంది.లోక్ సభ ఈమేరకు విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య చట్టం (ఫేమా) సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
గురువారం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.
కాగా HSBC జెనీవాశాఖలో ఖాతాదారులుగా ఉన్న వ్యక్తుల సంస్థల ప్రాసిక్యూషన్ కు ఆదాయం పన్నుశాఖ(ఐటీశాఖ) 121 కేసులు నమోదుచేసింది.
గురువారం నల్లధనంపై జస్టిస్ M B షా అధ్యక్షతన ఏర్పాటైన సిట్ సమావేశమై వివిధ దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించింది.
అంతేకాదు సుప్రీం కోర్టుకు మే 12లోగా సమర్పించాల్సిన నివేదికపై కూడా కోర్టు చర్చించింది.
No comments:
Post a Comment