Radio LIVE


Breaking News

Tuesday 7 October 2014

త్వరలో తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు

తెలంగాణా ప్రజలకు త్వరలో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ కార్డులను సమగ్ర సర్వే ఆధారంగా జారీ చేయనున్నారు.అన్ని పథకాలకు ఇక నుండి  రేషన్ కార్డుతో సంబంధం ఉండదని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.జిల్లా కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అన్ని రకాల పించన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆహ్వానించింది.అక్టోబర్ 15 నాటికి వీఆర్వో లకు దరఖాస్తు పత్రాలను అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు,ఐదు ఎకరాలు మించి భూమి ఉన్నవారికి,వ్యాపారస్థులకు కార్డుకు అనర్హులు.దారిద్ర్యరేఖకు దిగువన వున్న వారికి కుటుంబ ఆహారభద్రత కార్డులను జారీ చేస్తారు.ఆహారభద్రత కార్డుల కోసం ఈనెల 15(అక్టోబర్ 15) వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.నిరుపేద కుటుంబాల్లోని ప్రతీ ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఇవ్వనున్నారు.
త్వరలో రైతు రుణ ప్రక్రియను పూర్తి చేయాలని కెసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు.తెలంగాణా విద్యార్థులకు కొత్త కుల,నివాస ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు.దళితులకు భూపంపిణి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని,రాబోయే మూడేలల్లో 230 కోట్ల మొక్కలు నాటుతామని కెసిఆర్ తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates