Radio LIVE


Breaking News

Saturday 25 October 2014

సినిమా రివ్యూ : కార్తికేయ

సినిమా రివ్యూ : కార్తికేయ
రేడియో జల్సా రేటింగ్ : 3.25/5.00
విడుదల : అక్టోబర్ 24,2014
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం
సంగీతం : శేఖర్‌చంద్ర
తారాగణం : నిఖిల్,స్వాతీ రెడ్డి,రావు రమేష్,ప్రవీణ్,తనికెళ్ళ భరణి,తులసి
కథ
ద్రవిడుల కాలంలో సుబ్రమణ్యేశ్వరపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామికి గుడి కడతారు.ప్రతి యేటా కార్తీక పౌర్ణమి నాడు ఆ ఆలయం నుండి వెలుగులు ప్రసరించడం ఒక అధ్బుతం.అనుకోకుండా కొన్ని అనర్థాలు చోటు చేసుకోవడం,పాము కాటుతో అందరూ చనిపోతుండడం వల్ల గుడిని 2013 సంవత్సరంలో మూసేస్తారు.
కార్తీక్(నిఖిల్) మెడిసన్ చివరి సంవత్సరం చదువుతుంటాడు.కార్తిక్ కు మూడనమ్మకాలు అంటే గిట్టవు.తన బ్యాచ్ తో కలిసి మెడికల్ క్యాంపు కోసమని అదే ఊరికి వస్తాడు.సుబ్రమణ్యస్వామికి గుడి గురించి తెలుసుకున్న కార్తిక్ గుడిని ఎందుకు మూసేశారు,గుడి గురించి మాట్లాడుకుంటే ఎందుకు చనిపోతారు,అసలు రహస్యం ఏంటి మొదలగు వాటిని ఎలా చేధించాడో అన్నది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్
ఎక్కువగా అల్లరి చిల్లర పాత్రల్లో కనిపించే నిఖిల్ ‘స్వామి రారా’ చిత్రం ద్వారా తన పంథా మార్చుకున్నాడు.డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో నిఖిల్ మరో సారి తన పాత్రకు న్యాయం చేశాడు.నటన పరంగా నిఖిల్ కు మంచి పేరు తెచ్చే చిత్రం ఇది.స్వాతి కూడా తన సహజ ధోరణికి భిన్నంగా ఈ సినిమాలో కనిపించింది.ముఖ్యంగా సినిమాకు దర్శకుడు రాసుకున్న కథ ప్లస్ అని చెప్పవచ్చు.సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది.సినిమా కథ ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుంది.ప్రవీణ్‌, సత్య వినోదంతో పాటు రావు రమేష్,తనికెళ్ళ భరణి లు పర్వాలేదనిపించారు.పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంటుంది.కార్తీక్‌ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంటుంది.లో బడ్జెట్ సినిమా అని ఎక్కడా అనిపించదు.కొత్త డైరెక్టరే అయినా కథను బాగానే హేండిల్ చేయగలిగాడు.
మైనస్ పాయింట్స్
స్వాతి-నిఖిల్ మధ్య లవ్ ట్రాక్
సినిమా క్లైమాక్స్
సినిమా సెకండ్ హాఫ్
అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు
తీర్పు
కొంత వరకు భిన్నమైన కథే అని చెప్పవచ్చు.రొటీన్ కు భిన్నమైన కథ కోరుకునే వారికి ‘కార్తికేయ’ సరైన సినిమా.నిఖిల్ కు లభించిన మరో హిట్ సినిమా ఇది.కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ సస్పెన్స్,థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను థియేటర్లకు నడిపిస్తుంది.


No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates