Radio LIVE


Breaking News

Saturday 18 October 2014

ముదిరిన కాంట్రాక్ట్ విధానం-భారత్ పర్యటన నుండి తప్పుకున్న విండీస్ ఆటగాళ్ళు

విండీస్ ఆటగాళ్లకు,వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మరియు ప్లేయర్స్ అసోసియేషన్స్ కు మధ్య కాంట్రాక్టు వివాదం కారణంగా భారత్ పర్యటన పూర్తి కాకుండానే విండీస్ ఆటగాళ్ళు అర్దాంతరంగా పర్యటన నుండి తప్పుకున్నారు.పర్యటనలో మొదటి వన్డే జరగడానికి ముందువరకు ఇదే వివాదంతో మ్యాచ్ ఆడడానికి నిరాకరించారు విండీస్ ఆటగాళ్ళు,శుక్రవారం ధర్మశాలలో జరిగిన వన్డే కూడా మొదట ఆడడానికి నిరాకరించడంతో బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేల చేశారు.నాలుగో వన్డే ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో కెప్టెన్ బ్రావో తో పాటు సహచర ఆటగాళ్ళు అందరూ వచ్చి తమ నిరసన వ్యక్త పరిచారు.బ్రావో మాట్లాడుతూ అభిమానులను ఇబ్బంది పెట్టడడం ఇష్టం లేకే ఈ మ్యాచ్ ఆడుతున్నామని,సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని బ్రావో చెప్పాడు.
ఇంకా ఒక వన్డే,ఒక టీ20 మ్యాచ్,మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది విండీస్ జట్టు.పర్యటన మధ్యలోనే ఆగిపోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కి క్షమాపణలు చెప్పింది.ఇది కేవలం ఆటగాళ్ళ అంతర్గత కారణాల వల్లనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది విండీస్ క్రికెట్ బోర్డు.
విండీస్ ఆటగాళ్లను కనీసం ఒక్క సీజన్ అయిన ఐపీఎల్ మ్యాచ్ లు ఆడకుండా నిషేదించాలని సీనియర్ ఆటగాళ్ళు బోర్డుకు సూచిస్తున్నారు.
వెంటనే ప్రత్యామ్నాయాలను వెతికే పనిలోపడ్డ బీసీసీఐ శ్రీలంక తో 5వన్డేల సీరీస్ ను ఖరారు చేసుకుంది.నవంబర్ 1-15 ల మధ్య ఈ సీరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates