
టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అత్యంత
ప్రతిష్టాత్మకంగా వస్తున్న వస్తున్న చిత్రం ‘బాహుబలి’.ప్రభాస్ కథానాయకుడుగా
నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల
చేసింది.ఈ పోస్టర్ లో ప్రభాస్ ఒక చేత్తో గండ్ర గొడ్డలి,మరో చేత్తో కత్తి
పట్టుకొని కవచాలు,శిరశ్త్రాణం ధరించి యుద్ధ రంగంలో శత్రువులను
చీల్చిచెండాడే యోధుడుగా దర్శనిమిస్తున్నాడు.
ఈ పోస్టర్ మీద ఆర్కా మీడియా లోగో, బాహుబలి టైటిల్, 2015 అన్న పదాల తప్ప
మరేమీ లేకపోవడం గమనార్హం.ఇప్పటికే ‘మేకింగ్ అఫ్ బాహుబలి’ పేరుతొ విడుదలైన
వీడియోల ద్వారా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.తాజా పోస్టర్ చూస్తుంటే అవి
రెట్టిపయ్యేలా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment