Radio LIVE


Breaking News

Wednesday 22 October 2014

ఎబోలా నిర్ధారణలో కొత్త పరికరం అభివృద్ధి

ఎబోలా వ్యాధి నిర్ధారణకు ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు.ఇది అక్టోబర్ నెలాఖరులోగా ఎబోలా బాధిత దేశాలలో క్లినికల్ ట్రయల్ కు రానున్నది.
చేతిలో ఇమిడి పోయే ఈ పరికరంతో 15 నిమిషాల్లో, సొంతంగా ఇంట్లోనే వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
గర్భ నిర్ధారణ చేసుకునే చిన్న పరికరంలాగే ఇది ఉంటుందని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.వెడలాబ్ అనే యురోపియన్ ఫార్మ కంపెనీ ఈ పరిజ్ఞానాన్ని పరిచయం చేయనుంది.ఇప్పటివరకు అధికారికంగా దీనికి అనుమతులైతే లభించలేదు.
ఇంగ్లాండ్,అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన డాక్టర్లు కూడా దీనికి సంభందించిన పరికరాలను తయారు చేసే పనిలోనే ఉన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates