Radio LIVE


Breaking News

Friday 17 October 2014

'ఒక లైలా కోసం' రివ్యూ

తారాగణం : నాగచైతన్య, పూజా హెగ్డే, సుమన్‌, సయాజీ షిండే, అలీ, సుధ
సంగీతం: అనూప్ రూబెన్
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ, మాటలు, కథనం,దర్శకుడు: విజయ్ కుమార్ కొండా
విడుదల:అక్టోబర్ 17,2014
‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక లైలా కోసం’.’మనం’ చిత్రం తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం మీద మాములుగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకు తోడు ఈ చిత్ర పాటలు,ట్రైలర్లు కూడా చిత్రం మీద అంచనాలు పెంచాయి.మరి ప్రేక్షకుల అంచనాలు ఈ చిత్రం అందుకుందో లేదో చూద్దాం.
కథ : 
కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి వచ్చిన ఉద్యోగ అవకాశాలను వదులుకొని ఒక సంవత్సరం పాటు హాలిడే ట్రిప్ కు వెళుతాడు.మొదటి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు.నందన దృష్టిలో కార్తిక్ మంచి వాడు కాదు.అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది.కార్తీక్‌,నందన తల్లిదండ్రులు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు.అనుకోకుండా వారు చూసిన సంబంధం వీరే.కాని తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్ళికి ఒప్పుకుంటుంది.మరి కార్తీక్ ప్రేమ నందన అర్థం చేసుకుంటుందా?కార్తీక్ తన మీద ఉన్న ద్వేషాన్ని ఏవిధంగా పొగడతాడు?చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అనేదే చిత్ర కథ.
పాజిటివ్ పాయింట్స్ :
నాగ చైతన్య పూజా హెగ్డేల నటన
ఆలి కామెడీ
ఫోటోగ్రఫి
ఫస్ట్‌ హాఫ్‌
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
దర్శకత్వం
క్లైమాక్స్
పాటలు
సినిమాలో సినిమాటోగ్రఫీ ప్రతిభతో చిత్రానికి సరిపడే ఫీల్ ను అందించడంలో ఐ ఆండ్రూ సఫలమయ్యాడని చెప్పొచ్చు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ రూబెన్స్ ఆకట్టుకున్నా,పాటలు మాత్రం అంతగా ఆలరించలేకపోయాయి.నాగ చైతన్య,పూజా ల నటన బాగుంటుంది.ఆలి కామెడీ ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది.
మంచి ఫీల్ ఉన్న కథ అయినప్పటికీ కథను ప్రెసెంట్ చేసే విధానంలో దర్శకుడు విఫలమయ్యాడు.సినిమాలో అక్కడక్కడా దర్శకుని ప్రతిభ కనిపించినప్పటికీ కథనం స్లో గా సాగడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.
ప్రేక్షకులు ఎం జరుగుతుందో ముందే ఊహించడానికి దర్శకుడు అవకాశం కల్పించాడు,కాబట్టి ప్రేక్షకులకు అంత ఆసక్తిని కలిగించాలేడనే చెప్పాలి.
యూత్ మరియు ఫ్యామిలీ ‘ఒక లైలా..’కు కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి చిత్రం వసూళ్లు,భారీ విజయం ఆధారపడి ఉంది.

Radio Jalsa Rating : 3/5

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates