Radio LIVE


Breaking News

Tuesday 21 October 2014

జాతీయ పార్టీ హోదా కోల్పోనున్న బీస్పీ

మాయావతి నేతృత్వంలోని బీస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ)జాతీయ పార్టీ హోదా కోల్పోనుంది.
జాతీయ పార్టీ హోదా కాపాడుకోవడానికి ఆ పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుపొందాల్సి ఉండగా.. హర్యానాలో ఒక్క సీటు మాత్రమే గెలుపొందింది.
కాగా మహారాష్ట్రలో ఖాతా తెరవలేక పోయింది.దీంతో ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.
ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది.
ఈ నేపధ్యంలో బీఎస్పీ జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది.దీంతో మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికలయ్యేవరకు సమయం ఇవ్వాలని మాయావతి కోరారు.
ఈ ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు గెలవాల్సి ఉండగా.. హర్యానాలోని ప్రీత్ల స్థానంలో ఆ పార్టీ నుంచి టెక్ చంద్ శర్మ ఒక్కరే గెలుపొందారు.
జాతీయ పార్టీ హోదా రద్దుతో బీఎస్పీ ఈసీ నుంచి పలు ప్రయోజనాలను కోల్పోనుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates