Radio LIVE


Breaking News

Saturday, 25 October 2014

విజన్ 2020 ప్రణాళికలో భాగంగా బ్యాటింగ్ సలహాదారుగా VVS లక్ష్మణ్

ఈడెన్ గార్గేన్స్ లో 10 టెస్టుల్లో 5 సెంచరీలు.. 110.63 సగటుతో 1217 పరుగుల వరద పారించి కోల్ కతా దత్తపుత్రుడిగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ ఆ చారిత్రక స్టేడియంలో మరోసారి తన తడాఖా చూపనున్నాడు.. ఈసారి తన బ్యాటుతో కాదు.. యువ క్రికెటర్లకు ఎలా పరుగులు రాబట్టాలో తర్పీద్ నివ్వడం ద్వారా.
అవును నిజమే.. ఈ హైదరాబాద్ బ్యాట్ మన్ ను క్యాబ్ (బెంగాల్ క్రికెట్ సంఘం) విజన్ 2020 ప్రణాళికలో భాగంగా బ్యాటింగ్ సలహాదారు( కన్సల్టెంట్ )గా నియమించుకుంది. క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరబ్ గంగూలి లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పగించడంలో ప్రత్యేక చొరవ చూపించాడు. లక్ష్మణ్ క్యాబ్ బ్యాటింగ్ సలహాదారుగా తన నియామకం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఈడెన్ గార్డెన్స్ ఋణం తీర్చుకునే అవకాశం లభించిదన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates