Sunday, April 13, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 8 October 2014

పెనుతూఫాన్ గా మారుతున్న ‘హుదూద్’

గోపాల్ పూర్ కు ఆగ్నేయ దిశగా 820 కిలోమీటర్ల దూరంలో,విశాఖకు తూర్పు-ఆగ్నేయ దిశలో 810 కిలోమీటర్ల దూరంలో ‘హుదూద్’  కేంద్రీకృతమైంది.రానున్న 12 గంటల్లో ఈ తూఫాన్ పెనుతూఫాన్ గా మారి 24 గంటల్లో తీవ్ర పెనుతూఫాన్ గా మారనుందని విశాఖ తూఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఈ నెల 12న విశాఖ-గోపాల్ పూర్ వద్ద తూఫాన్ తీరం దాటనుంది.ఈ నెల 11న ఒడిశా తోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఓడరేవులలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.తీర ప్రాంతాలు,లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.



No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates