ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన నోకియా బ్రాండ్ ని మైక్రోసాఫ్ట్
ల్యుమియాగా మార్చనుందా ?అంటే ఔననే సమాధానం వస్తుంది. దాదాపుగా ఈ పేరును
ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ పేరుతో ఓ ప్రాంతీయ సోషల్ నెట్ వర్కింగ్
పేజీని ప్రారంభించింది. ఈ విషయాన్ని గురించి ప్రాన్స్ దేశంలోని నోకియా
ట్విట్టర్ ఎకౌంట్ లో కొంత సమాచారాన్ని పోస్ట్ చేసింది. నోకియా పేరుతో వచ్చే
ఫోన్లు ఏప్రిల్ లోనే ఆగిపోగా తర్వాత వస్తున్నావన్నీ ల్యుమియా పేరు మీదనే
వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇప్పటి వరకు పేరును మార్చలేదు. ప్రస్తుత
పరిణామాల ఆధారంగా నోకియా పేరును మరికొన్ని వారాల్లోనే ల్యుమియాగా మార్చడం
ఖాయమైనట్లు కనిపిస్తుంది.
No comments:
Post a Comment