హవాయి దీవుల్లోని కిలోయియా అగ్నిపర్వతం లావాను నిరంతరాయంగా
చిమ్ముతుండడంతో ఓ పట్టణానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ అగ్నిపర్వతం లావా
జూన్ 27 నుంచి చిమ్మడం మొదలై ఇప్పుడు పహోవ పట్టణ సమీపానికి దూసుకొచ్చింది.
ఇప్పటికే శ్మశాన వాటికను మింగేసి, ఆ పట్టణంలోని మొదటి గృహాన్ని
ముంచెత్తబోతుంది. గంటకు 10 మీ.గా లావా ప్రవాహం ఉంది. దీని ఉష్ణోగ్రత 900
డిగ్రీల సెల్సియస్ గా ఉంది. లావా ప్రవాహ దిశలో ఉన్న దుకాణాలను, పాఠశాలను
ఇప్పటికే మూసివేశారు.
No comments:
Post a Comment