Radio LIVE


Breaking News

Friday, 17 October 2014

ధర్మశాల వన్డేలో విండీస్ ను చిత్తు చేసిన భారత్

కోచి వన్డేలో అర్థ సెంచరీతో రాణించిన కోహ్లి ఈ మ్యాచ్ లో చెలరేగాడు.114 బంతుల్లో 13 ఫోర్లు,3 సిక్సుల సహాయంతో 127 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
ధర్మశాలలో విండీస్ తో జరిగిన 4వ వన్డేలో భారత్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.331 పరుగుల భారీ లక్ష్య చేధనలో విండీస్ 271 పరుగులు చేసి ఆలౌట్ అయింది.సామ్యుల్స్ 106 బంతుల్లో 9 ఫోర్లు,6 సిక్సుల సహాయంతో 112 పరుగులు చేసి ఒంటరి పోరు చేసిన విజయాన్ని అందించలేక చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
చివర్లో రస్సెల్స్ 23 బంతుల్లోనే 46 పరుగులు చేసి విజయంపై ఆశలు రేపినా అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు.భువనేశ్వర్ కుమారు అధ్బుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.అక్షర పటేల్ కూడా పొదుపైన బౌలింగ్ తో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు.యాదవ్,షమీ,జడేజా లు కూడా తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు శిఖర్ ధావన్(35),రహనే(68)లు మొదటి వికెట్ కు 70 పరుగులు జోడించాక,ధావన్ వికెట్ కోల్పోయాడు.తరువాత వచ్చిన కోహ్లి,రహనే తో కలిసి రెండో వికెట్ కు 72 పరుగులు జోడించాక 142 పరుగులవద్ద రహనే వెనుదిరిగాడు.తరువాత రైనతో జతకట్టిన కోహ్లి మరింత రెచ్చిపోయాడు.వీరిద్దరూ 3వ వికెట్ కు 138 పరుగులు జోడించారు.రైనా 71 పరుగులు చేయగా,ధోని 6,జడేజా 2,రాయుడు 12 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.కోహ్లి చివరి బంతికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.కోహ్లి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
దీంతో 5 వన్డేల సీరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.చివరి వన్డే ఈ నెల 20న కోల్ కతా లో జరుగుతుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates