Radio LIVE


Breaking News

Wednesday, 8 October 2014

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన భారత్

ప్రపంచ ఛాంపియన్ భారత్ జట్టు స్వదేశంలో విండీస్ తో మొదలైన వన్డే సీరీస్ లో బుధవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.సొంతగడ్డ పై ప్రపంచ కప్ కు ముందు చివరి వన్డే సీరీస్ ఆడుతున్న భారత్ కోచిలో జరిగిన మొదటి మ్యాచ్ లోనే బ్యాటింగ్,బౌలింగ్ లో విఫలమై పేలవమైన ప్రదర్శనతో 124 భారీ పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లను విండీస్ బ్యాట్స్ మెన్ ఒక ఆటాడుకున్నారు.ఓపెనర్లు గేల్,సిమ్మన్స్ లేకున్నా విండీస్ ఆటగాళ్ళు రెచ్చిపోయారు.22.3 ఓవర్లలో  120 పరుగుల వద్ద జత కలసిన సామ్యుల్స్,రామ్ దిన్ లు 4వ వికెట్ కు 165 పరుగులు జోడించారు.సామ్యుల్స్ 111 బంతుల్లో 11 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 126 పరుగులు జోడించి నాటౌట్ గా నిలిచాడు.రామ్ దిన్ 61 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 340 పరుగులు చేస్తుంది అనుకున్నా చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది విండీస్.
322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్ ను నెమ్మదిగా ఆరంభించింది.మొదటి వికెట్ కు రహనే(24),ధావన్ కలిసి 49 పరుగులు జోడించాక లేని రెండో పరుగు కోసం వెళ్లి రహనే వికెట్ ను కోల్పోయాడు.రహనే ఔటయ్యాక భారత్ ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్తున్నట్టు కనిపించలేదు.ఫామ్ లో లేక తంటాలు పడుతున్న కోహ్లి సొంతగడ్డపై రాణిస్తాడు అనుకున్నా నిరాశే మిగిల్చాడు.కేవలం రెండు పరుగులకే పెవీలియన్ బాట పట్టాడు.తరువాత వచ్చిన రాయుడు(13),రైనా(0),ధోని(8) వెంటవెంటనే ఔటయ్యారు.అర్థసెంచరీ పూర్తి చేసుకున్న తరువాత ధావన్(68) కూడా పెవీలియన్ కు చేరాడు.9 వికెట్ల నష్టానికి 155 పరుగుల వద్ద ఉన్న భారత్ చివరి వికెట్ కు జడేజా(33),షమీ(19) 47 పరుగులు జోడించి 197 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో సీరీస్ ను 1-0 ఆధిక్యంలో నిలిచింది విండీస్.సామ్యుల్స్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates