అమెరికా, చైనా రెండు దేశాల పరిశోధకులు సంయుక్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ ను
ఉపయోగించుకొని రెండు రోబోలు సమన్వయం చేసుకొని పనిచేసే విధానాన్ని
రూపొందించారు. అమెరికాలోని పిట్స్ బర్గ్ కు చెందిన ఓ యునివర్సిటీ
పరిశోధకులు, చైనాలోని ఓ యూనివర్సిటీ పరిశోధకులు ఇంటర్నెట్ బేస్డ్
కంప్యూటింగ్ ఉపయోగించుకొని వేర్వేరు తరహాలకు చెందిన రోబోలు సమన్వయంతో పని
చేసుకునే విధానాన్ని విజయవంతం చేశారు. ‘కేజా’ అనే చైనాకు చెందిన రోబో మానవ
భాషనూ అర్ధం చేసుకొని స్పందించగలదు.’కొబోట్ ‘ అనే పిట్స్ బర్గ్ కు చెందిన
రోబో అత్యంత క్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించగలదు.కేజా ఇంటిపనులు చేసే
రోబోగా,టూరిస్ట్ గైడ్ గా పని చేయగలదు.రెండు విభిన్న రోబోలను కలిపి క్లోడ్
కంప్యూటింగ్ ద్వారా పని చేయడం వల్ల తక్కువ ఖర్చుతో రోబోల అభివృద్ధి
విషయంలో మరింత పురోగతి సాధించవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment