వెస్టిండీస్ తో ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా భారత్ బుధవారం కోచి లో జరిగే మొదటి వన్డేలో తలపడనుంది.ప్రపంచ కప్ కు నాలుగు నెలల ముందు సొంతగడ్డ మీద భారత్ ఆడుతున్న చివరి వన్డే సీరీస్ ఇదే.ఇంగ్లాండ్ పర్యటనలో చేదు అనుభవాలను మూటగట్టుకున్న ధోని సేన ఈ సీరీస్ లో ఎలా రానిస్తుందో చూడాలి.
ఒకవిధంగా ఈ సీరీస్ భారత్ కు పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది.ఫామ్ లో లేని వెండీస్ భారత్ పై నెగ్గుతుంది అని ఆశించలేము,అందునా ముఖ్య ఆటగాళ్ళ గైరాజరీ,వామప్ మ్యాచ్ లో భారత్ ‘ఎ’ పై ఓడిపోవడం విండీస్ కు ప్రతికూలం.ఈ అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తుంది.ఐతే హార్డు హిట్టర్లకు పేరున్న విండీస్ ధోనీ సేనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.భారత గడ్డపై విండీస్ తో జరిగిన గత మూడు వన్డే సీరీస్ లలో భారత్ దే పైచేయి.
కోచిలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది.ఇక్కడ భారత్ 10 వన్డేలు ఆడగా అందులో 6 వన్డేల్లో భారత్ విజయాలు సాధించింది.అయితే ఈరోజు జరిగే వన్డే మ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.
అశ్విన్ కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేశారు.ఒక్క దేశావళి వన్డే ఆడకుండానే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.అందరి దృష్టి యాదవ్ పైనే ఉంది.ఇంకా ఈ మధ్య వరుసగా వన్డే మ్యాచ్ ల్లో విఫలమౌతున్న కోహ్లి ఎలా ఆడుతాడనేది వేచి చూడాలి.
No comments:
Post a Comment