సోమవారం బీహార్ లోని ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయను వియత్నాం
ప్రధాన మంత్రి నగుయిన్ టాన్ జింగ్ సందర్శించారు. ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి
జితిన్ రామ్ మాంఝీ గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం
పలికారు. అనంతరం వారు మహాబోది ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. బీహార్ లో పర్యాటక రంగంలో పెట్టుబడులను విసృతం చేసే అంశంపై ఈ
సందర్భంగా వియత్నాం ప్రధాని మాంఝీతో చర్చించారు.
No comments:
Post a Comment