Radio LIVE


Breaking News

Tuesday, 7 October 2014

‘దిక్కులు చూడకు రామయ్య’ సెన్సార్ రిపోర్ట్

లెజెండ్,ఊహలు గుసగుసలాడే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వారాహి చలనచిత్రం అందిస్తున్న మరో చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’.ఊహలు గుసగుసలాడే ఫేమ్ నాగ శౌర్య,సనా మక్బూల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసిన త్రికోటి దర్శకుడు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా U/A సర్టిఫికేట్ లభించింది.అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అజయ్ మరియు ఇంద్రజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
హాస్య కుటుంబకథా చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించగా సాయి కొరపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్లు పలువురిని ఆకట్టుకున్నాయి.సినిమా యూనిట్ సినిమా మీదా భారీగానే ఆశలు పెట్టుకుంది.కథ ఆసక్తిని కలిగిస్తుందని,తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates