నటీనటులు : మంచు మనోజ్,రకుల్ ప్రీత్ సింగ్,జగపతిబాబు,సన్నీ లియోన్,సంపూర్నేష్ బాబు,తాగుబోతు రమేష్,వెన్నెల కిశోర్,సుప్రీత్
దర్శకత్వం : జి నాగేశ్వరరెడ్డి
సంగీతం : అచ్చు
నిర్మాత : మంచు విష్ణు
విడుదల : 31 అక్టోబర్ 2014
తమిళంలో సూపర్ హిట్టైన ‘వర్తపడు వాలిబర్ సంఘం’కు రీమేక్ గా తీసిన చిత్రమే ‘కరెంటు తీగ’.మినిమమ్ గ్యారంటీ అని పేరున్న దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.బిజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో మనోజ్ కు జంటగా కనిపించింది.జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించారు.మంచు విష్ణుకు దేనికైనా రెడీ తో మంచి హిట్ ఇచ్చినా నాగేశ్వర్ రెడ్డి కరెంటు తీగతో మనోజ్ కు కూడా హిట్ ఇచ్చాడో లేదో చూద్దాం.
కథ :
పార్వతీపురం అనే గ్రామానికి శివరామరాజు(జగపతిబాబు) పెద్ద.ఆయనకు ముగ్గురు కూతుళ్ళు,వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్).అదే గ్రామానికి చెందిన వీర్రాజు(సుప్రీత్)తో శివరామరాజుకు వైరం ఉంటుంది.నా కూతుళ్ళలో ఎవరు ఎవరినీ ప్రేమించి పెళ్లి చేసుకోరని అలా చేసుకుంటే నా చెవులను కోసుకుంటాను లేదా వారిని చంపేస్తానని శపథం చేస్తాడు శివరామరాజు తన బద్ద శత్రువైన వీర్రాజుతో.
అదే ఊరిలో ఉంటున్న రాజు(మనోజ్) వీఐపీ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా ఉంటూ మంచి పనులు చేస్తుంటాడు.అయితే ఆ గ్రామ పాఠాశాలలో టీచర్ గా పనిచేస్తున్న సన్నీ(సన్నీ లియోన్)ను రాజు ప్రేమిస్తాడు.తన ప్రేమకు మధ్యవర్తిగా అదే స్కూల్ లో చదువుతున్న కవితను ఎంచుకుంటాడు.వీరి ప్రేమ కథకు కవిత సహాయం చేసిందా?లేకుంటే కవిత,రాజు ప్రేమలో పడుతుందా?వీరిద్దరి ప్రేమను జగపతిబాబు బ్రతికించి చెవులు కొసుకుంటాడా?మొదలగునవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అదే ఊరిలో ఉంటున్న రాజు(మనోజ్) వీఐపీ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా ఉంటూ మంచి పనులు చేస్తుంటాడు.అయితే ఆ గ్రామ పాఠాశాలలో టీచర్ గా పనిచేస్తున్న సన్నీ(సన్నీ లియోన్)ను రాజు ప్రేమిస్తాడు.తన ప్రేమకు మధ్యవర్తిగా అదే స్కూల్ లో చదువుతున్న కవితను ఎంచుకుంటాడు.వీరి ప్రేమ కథకు కవిత సహాయం చేసిందా?లేకుంటే కవిత,రాజు ప్రేమలో పడుతుందా?వీరిద్దరి ప్రేమను జగపతిబాబు బ్రతికించి చెవులు కొసుకుంటాడా?మొదలగునవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మంచు మనోజ్,జగపతి బాబు నటన
కామెడీ
రకుల్ ప్రీత్ సింగ్ ప్రాముఖ్యత ఉన్న పాత్ర,సన్నీ గ్లామర్
క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే స్లో
హీరోకు విలన్ కు మధ్య ఫైట్ దృశ్యాలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘కరెంటు తీగ’ ఒక విధంగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను తృప్తి పరచలేదు అని చెప్పవచ్చు.కామెడీ పర్వాలేదు అనిపించినప్పటికీ కథ రొటీన్ అనే ఫీలింగ్ సినిమా చూస్తుంటే కలుగుతుంది.సెకండ్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది.స్క్రీన్ ప్లే,దర్శకత్వం వహించిన నాగేశ్వర్ రెడ్డి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే నడిపించడంలో వెనకపడ్డాడు.మంచు మనోజ్ ఈ సినిమాలో లావుగా కనిపిస్తాడు,విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో అది కాస్త ప్లస్ అయింది.ఇక సన్నీ లియోన్ గ్లామర్,రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుంటాయి.అచ్చు సంగీతం సాదాసీదాగా ఉంది.మంచు విష్ణు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.తమిళ్ నుండి రీమేక్ అయిన ఈ సినిమాలో అక్కడక్కడా తమిళ్ షేడ్స్ కనిపిస్తాయి.
చివరగా ‘కరెంటు తీగ’ మనోజ్ కెరీర్ లో పెద్ద హిట్టా?కాదా అనేది ప్రేక్షకులే తేల్చాలి,అందుకు కొన్ని రోజలు ఆగాల్సిందే.
రేడియో జల్సా రేటింగ్ : 3/5
No comments:
Post a Comment