ఫేస్ బుక్ వినియోగ దారుల ఖాతాల రక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది.
దొంగిలించిన పాస్ వర్డ్,ఈ మెయిల్ ఐడీలను పర్యవేక్షించడానికి కొత్తగా
ఆటోమేటిక్ సర్వీస్ ను ప్రారంభించింది. తప్పుగా ఎంటర్ చేసే పాస్ వర్డ్,
ఈమెయిల్ ఐడీలను ఫేస్ బుక్ డేటాబేస్ లో ఉన్న సమాచారం ద్వారా కంప్యూటర్
ప్రోగ్రాం చే విశ్లేషించే విధానాన్ని రూపొందించారు.దీని ద్వారా పాస్ వర్డ్,
ఈమెయిల్ ఐడీలు కానీ తప్పుగా ఎంటర్ చేసినా , మరెక్కడైనా అనధికారికంగా
వాడుతున్నట్లు తేలినా ఫలానా వినియోగదారుడికి నోటిఫికేషన్ అందుతుందని ఫేస్
బుక్ పేర్కొంది.సమస్య తలెత్తిన ఫేస్ బుక్ ఖాతా వినియోగ దారుడికి పాస్ వర్డ్
మార్చుకోమని నోటిఫికేషన్ పంపుతామని సంస్థ తెలిపింది.
No comments:
Post a Comment