ఫేస్ బుక్ ప్రేమికులారా.. జాగ్రత్తగా పోస్టులు చేయండి. గుంటూరుకు చెందిన
న్యాయ విద్యార్థి చేసిన పోస్ట్ అతని అరెస్టుకు దారి తీసింది .అతను చేసిన
తప్పు ఏమిటంటే హుదూద్ తుఫాన్ ను నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతిని
నాశనం చేస్తున్న వారిని అది శిక్షించింది. దేవుడు అనేవాడు ఉన్నాడని ఫేస్
బుక్ లో కామెంట్ పెట్టాడు. అంతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హుదూద్
తుఫాన్ వల్ల ప్రజలకు భారీగా నష్టం వాటిల్లింది. 20 మంది ప్రాణాలు
కోల్పోయారు. ఇంత వినాశనం జరిగితే హుదూద్ తుఫాన్ ను ప్రేమిస్తున్నానని
కామెంట్లు చేయడంపై పోలీసులు మండిపడ్డారు.
No comments:
Post a Comment