మాజీ ఎన్పీసీఐఎల్ డైరెక్టర్ ఇస్మాయిల్ ఖాన్ ను తెలంగాణా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)కు ఛైర్మన్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ఇస్మాయిల్ ఖాన్ ను ఛైర్మెన్ గా ఎంపిక చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈఆర్సీ ఆర్ధిక సభ్యుడిగా శ్రీనివాసులు, ఈఆర్సీ టెక్నికల్ సభ్యుడిగా ఎల్.మనోహర్ రెడ్డి నియమితులయ్యారు.ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఇస్మాయిల్ ఖాన్ బీహార్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
No comments:
Post a Comment