Radio LIVE


Breaking News

Tuesday, 28 October 2014

అమ్మాయిల శవాలు దొంగిలించడం,ఇంట్లో పెట్టుకోవడం..అతని వృత్తి

స్మశానంలో సమాధులను త్రవ్వడం,పూడ్చిపెట్టిన బాలికల శవాలను శవపేటిక నుండి దొంగిలించి ఇంట్లో పెట్టుకొని వాటిని అందంగా అలంకరించి బొమ్మాల్లా తయారు చేయడం అతని సరదా.గత పది సంవత్సరాలుగా అతనికి ఇదే పని. పది సంవత్సరాల తరువాత తన కూతురు సమాధిలో ఖాళీ శవపేటిక మాత్రమే ఉందని గ్రహించిన ఒక తల్లి మనోవేదనతో జరిగిన విషయాన్ని పోలిసులకు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే : పది సంవత్సరాల క్రితం ఓల్గా అనే పది సంవత్సరాల వయసున్న బాలికను ఇంటి బయట ఒకడు డ్రగ్స్ మత్తులో రాడ్ తో తల మీద బాది చంపేశాడు.ఓల్గాను తల్లిదండ్రులు అక్టోబర్ 2,2002 సంవత్సరంలో శవపేటికలో పెట్టి సమాధిలో పూడ్చి పెట్టారు.మే7,2003న ఓల్గా సమాధికి పెయింట్ వేసి చుట్టూ చిన్న కంచే వేశారు బాలిక తల్లిదండ్రులు.మరుసటి రోజు సమాధి దగ్గరకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు సమాధిని ఎవరో తాకారు అని తెలుసుకున్నారు,అంతకముందు రోజు సమాధిమీద ఉంచిన పుష్పగుచ్చం పక్కకు జరిగి ఉండడంతో వారికి అనుమానం వచ్చింది.అప్పుడప్పుడు ఆ సమాధిమీద ఏవేవో రాతలు,కొన్ని సందర్భాలలో పుష్పగుచ్చాలు,బొమ్మలు కనిపించేవి.భయపడిన ఓల్గా తల్లిదండ్రులు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. కాని సరిగ్గా 10 సంవత్సరాల తరువాత తమ కూతురు శవం సమాధిలో లేదని తెలుసుకున్న బాలిక తల్లి నటాలియా రోదిస్తూ ఏమీ తెలియని 10 సంవత్సరాల చిన్నారిని చంపేశారని,తన ఆత్మ స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటుంది అనుకున్నాను కాని ఇలా శవాన్ని కూడా దొంగిలిస్తారని అనుకోలేదని వాపోయింది.
ఇదంతా చేసింది మేధావి అని చెప్పుకునే 46 సంవత్సరాల రష్యా చిత్రకారుడు అనటోలి మోస్క్విన్.నిజానికి విషయం తెలుసుకున్న పోలీసులు అనటోలిని 2011 లోనే అరెస్ట్ చేశారు.అతని ఇంట్లో సోదా చేయగా 29 శవాలు కనిపించాయి.కుళ్ళిపోయిన శవాలకు,అస్థిపంజరాలకు పిల్లలు ఆడుకునే బొమ్మల్లా అలంకరణలు చేసి ఇంట్లో భద్రపరుచుకునే వాడు.పోలీసులు స్వాధీనం చేసుకున్న 29 శవాల్లో మీ కూతురు శవం ఉందో చూసుకోండి అని పోలీసులు చెప్పడంతో ఓల్గా సమాధిని త్రవ్వి చూడగా కేవలం పెద్ద రంధ్రంతో ఉన్న శవపేటిక మాత్రమే కనిపించింది. పది సంవత్సరాలుగా కేవలం శవపేటికనే దర్శించుకుంటున్నామా అని ఓల్గా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అనటోలి విషయానికి వస్తే 3 నుండి 12 సంవత్సరాల వయసున్న బాలికల శవాలను దొంగిలించి ఇంట్లో పెట్టుకునేవాడు.ఎందుకు అలా చేశావ్ అని కోర్టు ప్రశ్నిస్తే పొంతనలేని,నమ్మశక్యం కాని వాదనలు వినిపించాడు.బాలికల సమాధుల దగ్గరకు వెళ్ళినప్పుడు అవి నాతో మాట్లాడేవని,మమ్ముల్ని ఇక్కడినుండి తీసుకుపొమ్మని చెప్పేవని చెప్పుకొచ్చాడు. నిందితుడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే వారు వింత సమాధానాలు చెప్పారు.మా అబ్బాయి తీసుకువచ్చేవి బొమ్మలే అని అనుకుంటున్నామని ముసలి తల్లిదండ్రులు చెప్పారు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కోర్టు మానసిక చికిత్స నిమిత్తం మెంటల్ హాస్పిటల్ కు తరలించాలని పోలీసులకు సూచించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates