Radio LIVE


Breaking News

Friday, 17 October 2014

జయలలితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

అక్రమాస్తుల కేసులో అరెస్టై గత 20వ రోజులుగా జైల్లో ఉంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సీబీఐ కోర్టు విధించిన 4 సంవత్సరాల జైలు శిక్షకు సుప్రీంకోర్టు స్టే విధించింది.జయలలిత తరుపున ప్రముఖ న్యాయవాదులు నారీమన్,తులసి,సుశీల్ కుమార్ వాదనలు వినిపించారు.కర్ణాటక కోర్టులో జయలలిత బెయిల్ పిటీషన్ ను కొట్టివేసిన తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే 43వ వార్షికోత్సవం నాడే జయలలితకు బెయిల్ మంజూరు చేయడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.జయలలితతో పాటు ఇలవరసి,శశికళ,సుధాకరన్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా కోర్టు జయలలితకు కొని షరతులు విధించింది.హైకోర్టు లో వాయిదాలు అడగకూడదు,అప్పీలుకు సంభందించి సమగ్ర నివేదిక 2నెలల్లో సమర్పించాలి,సమగ్ర నివేదికకు ఒక్కరోజు కూడా గడువు పెంచేదిలేదు అని మొదలగు షరతులు విధించింది కోర్టు. శాంతి భద్రతలకు భంగం కలిగించరాదని పార్టీ శ్రేణులకు సూచించాలని జయకు కోర్టు సూచించింది.
జయలలిత 21 రోజులపాటు కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో గడిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates