Radio LIVE


Breaking News

Friday, 17 October 2014

గెలిస్తేనే సీరీస్ పై ఆశలు

ఐదు మ్యాచ్ ల వన్డే సీరీస్ లో భాగంగా భారత్,వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం ధర్మశాల వేధికగా 4వ వన్డే జరుగుతుంది.ఏకపక్షంగా సాగుతుందనుకున్న సీరీస్ కాస్త హోరాహోరిగా సాగుతుంది.మొదటి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన భారత్,రెండో మ్యాచ్ లో ఓటమి అంచునుండి గెలుపు బాట పట్టింది,ఒక దశలో 170 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటుందని అనుకున్నా ఒత్తిడిలో 215 పరుగులకే ఆలౌట్ అయింది.ఇక మూడో మ్యాచ్ సైక్లోన్ హుదుద్ కారణంగా విశాఖలో జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే.దీంతో 5వన్డేల సీరీస్ 4వన్డేల సీరీస్ గా మారిపోయింది.
4వ వన్డే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో శుక్రవారం జరుగుతుంది.ఈ మ్యాచ్ లో నెగ్గితేనే భారత్ కు సీరీస్ నిలబెట్టుకునే అవకాశం ఉంది.ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమైనదే.ఐతే పేసర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్ మీద భారత్ బౌలర్లు ఎలా రానిస్తారనేదే ప్రశ్న.విండీస్ పేస్ బౌలింగ్ భారత్ కంటే బలంగా ఉంది.నాలుగో వన్డే కోసం పిచ్ ను మరింత వేగంగా మార్చేశామని ఇక్కడి క్యురేటర్ ఇప్పటికే చెప్పేశారు,పిచ్ మీద పచ్చిక ఉంటుందని,బంతి బౌన్స్ అవుతుందని,పరుగులు కూడా విరివిగా ఈ పిచ్ మీద రాబట్టవచ్చు అని క్యురేటర్ చెప్పడంతో ఆసక్తికరంగా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ తో భారత్ కెప్టెన్ 250 వన్డేలు పూర్తి చేసుకోనున్నాడు.మ్యాచ్ భారతకాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగును.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates