ఒక చోట బిల్డింగ్ బార్ లతో ఉంటుంది.మరో చోట బిల్డింగే బార్.ఏదైతే ఏంటి
రెండింటిలో ఉండేది బారే కదా అనుకుందో ఏమో,ఏకంగా ఒక యువతి బార్ అనుకోని
పొరబడి పోలీస్ స్టేషన్ కే వెళ్లి పోలీసులకు అడ్డంగా బుక్కై బార్లు
లెక్కపెట్టాల్సి వచ్చింది.
మిచిగన్ కు చెందిన 39 సంవత్సరాల ఒక యువతి తన ప్రియుడిని తీసుకురావడానికని బార్ కు వెలదామనుకుంది.కాని తను వెళ్ళే దారిలో ‘వాన్ బురెన్ కౌంటీ జైలు’వద్దకు వచ్చే వరకు అదే బార్ అనుకొని కారును నేరుగా పార్కింగ్ స్థలానికి తీసుకెళ్ళింది.అది గమనించిన పోలీస్ ఆఫీసర్ ఆమె కారు దగ్గరకు వెళ్ళగా మద్యం వాసన రావడంతో,బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయగా మామూలు కన్నా రెండొంతులు అధికంగా మద్యం సేవించినట్టు గుర్తించి అతిగా మద్యం సేవించి కారును నడిపినందుకు జైల్లో వేశారు.
మద్యం మత్తులో తను చేసిన పని పోలిసులకు పని తప్పించినట్టైంది…….

No comments:
Post a Comment