విండీస్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో కోచిలో జరిగిన మొదటి వన్డేలో ఘోర
పరాజయాన్ని మూటగట్టుకొన్న భారత్ శనివారం ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో
సత్తా చాటింది.48 పరుగుల తేడాతో విండీస్ ను ఓడించి సీరీస్ ను 1-1 తో సమం
చేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.ఫామ్ తో తంటాలు పడుతున్న కోహ్లి ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో రాణించి 62 పరుగులు చేశాడు.సురేష్ రైనా ధాటిగా ఆడుతూ 62 పరుగులు చేశాడు.చివర్లో ధోని 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.జెరోమ్ టేలర్ 3 వికెట్లు తీసుకున్నాడు.
264 పరుగుల లక్ష్యం ఫెరోజ్ షా కోట్ల మైదానం పిచ్ మీద కొంత కష్ట సాధ్యమే అయినప్పటికీ విండీస్ బరిలోకి దిగిన విండీస్ లక్ష్యాన్ని సునాయాసంగానే చేధించేలా కనిపించింది.ఒక దశలో 182 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి బలంగా ఉన్న విండీస్ ఒక్కసారిగా కుప్పకూలింది.డ్వేన్ స్మిత్ 97 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు.ఇక అంతే వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది విండీస్.చివరకు 46.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.షమీ 4 వికెట్లు తీసుకోగా,జడేజా 3,అమిత్ మిశ్రా 2,ఉమేష్ 1 వికెట్ సాధించారు.
కెరీర్ బెస్ట్ సాధించిన షమీకి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

No comments:
Post a Comment