మహారాష్ట్ర లోని పండరీపురం మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం చింతలపూడి గ్రామానికి చెందిన 8 మంది మృత్యువాతపడ్డారు.
సెప్టెంబర్ 29న షిరిడీతో పాటు పలు పుణ్యక్షేత్రాల దర్శననిమిత్తం చింతలపూడి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 45 మంది బాలాజీ ట్రావెల్స్ అద్దెకు తీసుకొని బయలుదేరారు.తిరుగు ప్రయాణంలో ఉన్న వీరి బస్సు పండరీపురం వద్ద ఉన్న ఉజని డ్యాం బ్యాక్ వాటర్ కాలువలోకి లోకి పడిపోయింది.ఆసమయంలో బస్సులో 51 మంది ఉన్నట్టు సమాచారం.ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల భౌతికకాయాలకు కర్మాలా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.
విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతికి గురయ్యారు.భాదితులకు తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భాదితులను తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ఈ విమానంలో మృతదేహాలు,భాదితులు షోలాపూర్ విమానాశ్రయం నుండి గన్నవరం చేరుకుంటారు.
మృతుల వివరాలు:
లక్ష్మీ(45),లక్ష్మీ(55),లక్ష్మీకుమారి(50),శేశమణి(45),వెంకటేశ్వరమ్మ(45),చలమలశెట్టి పాండురంగ(60),జగన్మోహన్ రావు(55),రేష్మ(20)
No comments:
Post a Comment